Delhi: వాహనాలకు ఈ సర్టిఫికెట్ లేకుంటే జైలుకే.. కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi govt made vehicles pollution certificate compulsory
  • వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ కంపల్సరీ
  • తనిఖీల సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా దగ్గరుండాలి
  • లేకపోతే ఆరు నెలలు జైలు శిక్ష లేదా 10 వేల జరిమానా
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంది. గతంలో కొన్ని రోజుల పాటు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ సరి, బేసి ఆధారంగా రోడ్డుపైకి వచ్చేలా నిబంధనలు అమలు చేసింది. లాక్ డౌన్ సమయంలో గాలి కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మళ్లీ లక్షలాది వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో కాలుష్యం క్రమంగా పెరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ టెస్ట్ కచ్చితంగా చేయించాల్సిందేనని హెచ్చరించింది. రోడ్డు మీదకు వచ్చే వాహనాలకు సంబంధించిన పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా దగ్గర ఉంచుకోవాలని తెలిపింది. వాహనాలను తనిఖీ చేసే సమయంలో పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
Delhi
Pollution Certificate
Vehicles

More Telugu News