Badvel: రేపు బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు... ఏర్పాట్లు పూర్తి

Badvel By Election counting arrangements concluded
  • గత నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
  • నవంబరు 2న ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
  • 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

అక్టోబరు 30న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరగ్గా, రేపు (నవంబరు 2) ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. 4 హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

దీనిపై రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగిందని, ఓటింగ్ లో ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచామని తెలిపారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News