Uttar Pradesh: భార్య పెళ్లికి పెద్దగా భర్త.. ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి వివాహం

Man sacrifices his marriage weds his wife to her boyfriend in Uttarpradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • భార్య మరో వ్యక్తిని ప్రేమిస్తుందని తెలిసి వివాహానికి ఏర్పాట్లు
  • ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి ఒప్పించిన భర్త
  • విడాకులు ఇచ్చి ప్రియుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన వైనం
వారిద్దరికీ వివాహమై ఆరునెలలైంది. పెళ్లయినప్పటి నుంచి భార్య ముఖంలో సంతోషం కనిపించలేదు. దీంతో ఆమె సమస్య ఏంటో తెలుసుకున్న అతడికి విస్తుపోయే నిజం తెలిసింది. ఆమె మరో వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తెలిసి అతడి గుండె బద్దలైంది. అయినా తమాయించుకుని ఆమె సంతోషాన్నే కోరుకున్నాడు. ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి అతడే పెద్దయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాన్పూరుకు చెందిన కోమల్-పంకజ్ భార్యాభర్తలు. ఆరు నెలల క్రితం వీరికి వివాహమైంది. అయితే, పెళ్లయినప్పటి నుంచి భార్య ముఖంలో సంతోషం లేకపోవడాన్ని గమనించిన భర్త పంకజ్ సమస్యేంటో చెప్పాలని భార్యను కోరాడు. ‘నీ సంతోషమే నా సంతోష’మన్నాడు. భర్త మాటలు విశ్వసించిన ఆమె తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. తాను పింటు అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడు లేని జీవితం వృథా అని ఆవేదన వ్యక్తం చేసింది. తమ ప్రేమ విషయం తెలిసినా కుటుంబ సభ్యులు బలవంతంగా తన పెళ్లి జరిపించారని చెప్పి బోరున విలపించింది.

భార్య చెప్పింది విన్న పంకజ్ కోపంతో ఊగిపోలేదు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమె తనతోకంటే పింటూతోనే సంతోషంగా ఉంటుందని భావించాడు. ‘నీ సంతోషం కంటే నాకు కావాల్సిందేమీ లేదంటూ’ పింటూతో మాట్లాడి వివాహానికి ఏర్పాట్లు చేశాడు. అంతకంటే ముందు ఇరు కుటుంబాలతో మాట్లాడి వారికి నచ్చజెప్పాడు. అనంతరం భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో పింటుతో భార్య పెళ్లికి అడ్డంకి తొలగిపోయింది. అనంతరం అతడే పెళ్లిపెద్దగా వ్యవహరించి వారి పెళ్లిని ఘనంగా జరిపించాడు.
Uttar Pradesh
Marriage
Kanpur
Lover

More Telugu News