Harbhajan Singh: న్యూజిలాండ్ తో మ్యాచ్... కొత్త ఓపెనింగ్ కాంబినేషన్ ను సూచించిన హర్భజన్ సింగ్!

  • రోహిత్ తో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రావాలి
  • ఇషాన్ అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వగలడు
  • మూడు, నాలుగు స్థానాల్లో కోహ్లీ, కేఎల్ రాహుల్ రావాలి
Ishan Kishan to come as opener says Harbhajan Singh

టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం న్యూజిలాండ్ తో జరగనున్న తదుపరి మ్యాచ్ లో జట్టు కూర్పుపై క్రికెట్ ఎక్స్ పర్ట్స్ పలు సలహాలను ఇస్తున్నారు.

తాజాగా తన యూట్యూబ్ ఛానల్ నుంచి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రావాలని చెప్పారు. ముంబై ఇండియన్స్ కు చెందిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ పవర్ ప్లే ఓవర్లతో అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వగలడని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ ఓపెనర్ గా రావడం మన జట్టుకు అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రోహిత్ తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే... ఇండియాకు మనం కోరుకున్న ప్రారంభం దక్కుతుందని అన్నారు.

ఇషాన్ ఒక ఆరు ఓవర్ల పాటు క్రీజులో ఉంటే... ఇండియా స్కోరు 40 నుంచి 50 పరుగులు బదులు... 60 నుంచి 70 పరుగులుగా ఉంటుందని భజ్జీ చెప్పారు. ఇషాన్ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని అన్నారు. రోహిత్ తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తే... ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ తో కలిపి టాప్ ఫోర్ ఆర్డర్ బలంగా ఉంటుందని చెప్పారు. రిషభ్ పంత్ ను ఐదో స్థానంలో దింపవచ్చని సూచించాడు.

More Telugu News