సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

29-10-2021 Fri 07:29
  • పోస్ట్ ప్రొడక్షన్ లో నిత్యా మీనన్ 'స్కైలాబ్'
  • బార్సిలోనా షూటింగ్ ముగించిన మహేశ్
  • గోవాలో 'తీస్ మార్ ఖాన్' రొమాన్స్    
Nitya Menons Skylab in post production mode
*  నిత్యా మీనన్ కథానాయికగా రూపొందుతున్న చిత్రం 'స్కైలాబ్'. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. నవంబర్ ఒకటిన ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.
*  మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం బార్సిలోనా షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. మూడు వారాల పాటు అక్కడ జరిగిన షూటింగులో కొన్ని సన్నివేశాలను, ఒక పాటను హీరో హీరోయిన్లపై చిత్రీకరించారు. చివరి షెడ్యూలు వచ్చే నెల మొదటి వారం నుంచి ఆ నెలాఖరు వరకు హైదరాబాదులో జరుగుతుంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
*  ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న 'తీస్ మార్ ఖాన్' చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. హీరో హీరోయిన్లపై అక్కడ ప్రస్తుతం ఓ రొమాంటిక్  సాంగును చిత్రీకరిస్తున్నారు. కల్యాణ్ జీ గోగణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.