Hyderabad: శాడిస్ట్ భర్త.. భార్యను పలు రకాలుగా వేధిస్తున్న ఉన్మాది

Jubilee Hills Police files Case against Sadist Husband
  • ప్రేమ వివాహం చేసుకున్న మహిళ
  • అర్ధ నగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని వేధింపులు
  • నిందితుడిపై అట్రాసిటీ కేసు నమోదు
భార్యను పలు రకాలుగా వేధిస్తున్న శాడిస్టు భర్తపై హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో నివసిస్తోంది. 2016లో ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించారు.

ఇక అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇంటిల్లిపాదీ ఆమెను కులం పేరుతో వేధించడం మొదలుపెట్టారు. పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని పలుమార్లు బెదిరించారు. దీంతో భర్తకు 1.50 లక్షలు ఇచ్చింది. అయినప్పటికీ భర్త ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు.

అతడి వేధింపులు రోజురోజుకు మరింతగా మితిమీరుతుండడంతో భరించలేని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Jubilee Hills
Crime News
Woman
Police

More Telugu News