'భీమ్లా నాయక్' సెట్స్ పైకి సంయుక్త మీనన్!

28-10-2021 Thu 18:56
  • తెలుగు తెరకు మరో మలయాళ మందారం
  •  రానా సరసన నాయికగా అవకాశం
  • షూటింగులో జాయినైన సంయుక్త
  • జనవరి 12వ తేదీన విడుదల      
Bheemla Nayak movie update
తెలుగు తెరపై మలయాళ భామల జోరు ఎక్కువ. అక్కడి నుంచి వచ్చిన వారే ఇక్కడ ఎక్కువగా రాణిస్తుంటారు. తాజాగా మరో మలయాళ సుందరి తెలుగు తెరకి పరిచయమవుతోంది .. ఆమె పేరే సంయుక్త మీనన్. 'భీమ్లా నాయక్'లో పవన్ సరసన నిత్యామీనన్ ను తీసుకున్న దర్శక నిర్మాతలు, రానా జోడీగా సంయుక్త మీనన్ ను ఎంపిక చేశారు.

ఇంతవరకూ పవన్ - రానా, పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తూ వచ్చారు. ఇక రానా - సంయుక్త మీనన్ కాంబినేషన్ సీన్లను చిత్రీకరించవలసి ఉంది. తాజాగా ఆమె ఈ సినిమా షూటింగుకి హాజరైంది .. ఈ సినిమా టీమ్ ఆమెకి వెల్ కమ్ చెబుతూ ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

రానా - సంయుక్త మీనన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తే షూటింగు పార్టు పూర్తయినట్టే. నిజానికి సంయుక్త మీనన్ .. కల్యాణ్ రామ్ 'బింబిసార' ద్వారా పరిచయం కావలసింది. ఆ సినిమా ఆలస్యం కావడం వలన, ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.