'రొమాంటిక్' మాస్ సాంగులో మెరవనున్న రామ్!

28-10-2021 Thu 18:27
  • ఆకాశ్ పూరి హీరోగా 'రొమాంటిక్'
  • ప్రభాస్ ప్రమోషన్స్ తో పెరిగిన క్రేజ్
  • కలిసొచ్చిన విజయ్ దేవరకొండ ఇమేజ్  
  • తనవంతు సందడి చేయనున్న రామ్
Romantic movie update
ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను పూరి తన సొంత బ్యానర్లో నిర్మించడమే కాకుండా, కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు తానే అందించాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో అటు ప్రభాస్ .. ఇటు విజయ్ దేవరకొండ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా విజయ్ దేవరకొండ రావడం .. హీరో హీరోయిన్లను ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడంతో ఈ సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందరి కళ్లలోను .. నోళ్లలోను నానుతోంది.

ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ ని కూడా పూరి రంగంలోకి దింపినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో 'పీనే కే బాద్' అనే ఒక పాట ఉంది. ఈ పాటలో రామ్ మెరవనున్నాడని చెప్పుకుంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'లో దుమ్మురేపేసిన రామ్, ఈ సాంగ్ లో ఎలా సందడి చేస్తాడో చూడాలి.