సోషల్ మీడియా లైవ్ లో ఆత్మహత్యాయత్నం చేసిన 'మిస్ తెలంగాణ' హాసిని

28-10-2021 Thu 16:25
  • 2018లో మిస్ తెలంగాణ టైటిల్ గెల్చుకున్న హాసిని
  • పోలీసులకు సమాచారం అందించిన ఆమె స్నేహితులు
  • హాసినిని రక్షించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Miss Telangana 2018 attempts suicide in Hyderabad
మిస్ తెలంగాణ-2018 విన్నర్ హాసిని ఆత్మహత్యాయత్నం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో లైవ్ లో ఆమె ఆత్మహత్యకు యత్నించారు. దీన్ని చూసిన వెంటనే ఆమె స్నేహితులు నెంబర్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన హైదరాబాదులోని నారాయణగూడ పోలీసులు హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 6లో ఉన్న ఆమె ఫ్లాట్ కు చేరుకుని ఆమెను రక్షించారు. వెంటనే ఆమెను హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఒక యువకుడు తనను వేధిస్తున్నాడంటూ హాసిని ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడేండుకు యత్నించడం గమనార్హం. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.