Sensex: కుప్పకూలిన మార్కెట్లు... 1,158 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

  • అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలు
  • 353 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 5.54 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్ విలువ
Stock markets collapses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూలతలతో పాటు, అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో సూచీలు తీవ్రంగా నష్టపోయాయి. రియాల్టీ, పవర్, మెటల్, బ్యాంకింగ్ సూచీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఈ క్రమంలో ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,158 పాయింట్లు కోల్పోయి 59,984కి దిగజారింది. నిఫ్టీ 353 పాయింట్లు పతనమై 17,857 కి పడిపోయింది. కన్జ్యూమర్ గూడ్స్ సూచీ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.94%), ఎల్ అండ్ టీ (1.92%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.11%), ఏసియన్ పెయింట్స్ (1.04%), మారుతి సుజుకి (0.28%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-5.54%), ఐసీఐసీఐ బ్యాంక్ (-4.39%), యాక్సిస్ బ్యాంక్ (-3.75%), టైటాన్ కంపెనీ (-3.68%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.42%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.05%).

More Telugu News