కర్నూలు జిల్లాలో వైసీపీకి చెందిన రెండు కుటుంబాల మధ్య దాడులు... పలువురికి గాయాలు

28-10-2021 Thu 12:42
  • ఆరేకల్లు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
  • ఏడుగురికి తీవ్ర గాయాలు
  • ఇంటి నిర్మాణం సందర్భంగా పక్కింటి వద్ద రాళ్లు పడటంతో గొడవ
Two YSRCP families fights in Kurnool district
కర్నూలు జిల్లాలో వైసీపీ పార్టీకి మద్దతుదారులైన రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. కర్రలతో కొట్టుకున్నాయి. ఈ ఘటన ఆరేకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గ్రామంలో లక్ష్మన్న ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనున్న తిమ్మారెడ్డి ఇంటి దగ్గర రాళ్లు పడ్డాయి. దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.

మాటామాటా పెరిగి... ఇరు కుటుంబాలు దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.