Punarnavi: నేనలాంటి దాన్ని కాదు... నాకేం కావాలో దాని వెంటపడతా: పునర్నవి

Punarnavi shared a pic at Royal School of Drama in London
  • సినిమాలకు దూరంగా ఉంటున్న పునర్నవి
  • లండన్ లో నటనకు మెరుగులు దిద్దుకుంటున్న వైనం
  • ఇన్ స్టాగ్రామ్ లో పిక్ షేర్ చేసిన నటి
  • నన్ను నేను కొత్తగా మార్చుకుంటున్నాను అంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఈ విరామ సమయంలో తన నటనకు మెరుగులు దిద్దుకుంటోంది. పునర్నవి ప్రస్తుతం లండన్ లోని ప్రఖ్యాత 'రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా'లో శిక్షణ పొందుతోంది.

ఈ సందర్భంగా ఆమె ఓ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, "నాకేమైంది అంటూ బాధపడుతూ కూర్చునే రకాన్ని కాదు నేను... నేను ఏమవ్వాలని కోరుకుంటున్నానో దాన్ని వెంటాడి సాధించే రకాన్ని! నన్ను నేను అర్థం చేసుకునే ప్రయాణాన్ని ప్రారంభించాను. ఇప్పటివరకు నా జీవితంలోకి వచ్చిన ప్రతి అనుభవాన్ని భూస్థాపితం చేసి నన్ను నేను కొత్తగా మెరుగుపర్చుకుంటున్నాను" అంటూ వివరించింది.
Punarnavi
Royal Scholl Of Drama
London
Tollywood

More Telugu News