సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

28-10-2021 Thu 07:31
  • బాలకృష్ణకు జోడీగా శ్రుతిహాసన్  
  • ప్రభాస్ 'ఆదిపురుష్' అప్ డేట్
  • 'మంచిరోజులు వచ్చాయి' సెన్సార్ పూర్తి  
Shruti Hassan to be cast opposite Balakrishna
*  ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రుతిహాసన్ త్వరలో బాలకృష్ణకు జంటగా నటించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే భారీ చిత్రంలో హీరోయిన్ పాత్రకు శ్రుతిహాసన్ ఎంపిక దాదాపు పూర్తయినట్టు సమాచారం.
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదిపురుష్' చిత్రం షూటింగును నవంబర్ నెలాఖరు లోగా పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విలన్, హీరోయిన్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం హీరో పాత్రకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న దీనిని రిలీజ్ చేస్తారు. ఇందులో ప్రభాస్ సరసన కృతిసనన్ కథానాయికగా నటిస్తోంది.
*  మారుతి దర్శకత్వంలో రూపొందిన 'మంచిరోజులు వచ్చాయి' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.