Brad Haddin: ఈ ఆటగాడ్ని తొలగించడంపై భారత్ నిర్ణయం తీసుకోవాలి: బ్రాడ్ హడిన్

Brad Haddin responds on Hardik Pandya issue
  • టీమిండియాను వేధిస్తున్న ఆల్ రౌండర్ కొరత
  • జట్టులో ఉన్నా బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్య
  • పాండ్య ఇప్పుడు బౌలింగ్ చేసినా కష్టమేనంటున్న హడిన్
  • సఫలమయ్యే అవకాశాలు తక్కువేనని వివరణ

భారత్ జట్టులో సమర్థుడైన ఆల్ రౌండర్ కొరత ఎన్నాళ్ల నుంచో వేధిస్తోంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి జట్లు నికార్సయిన ఆల్ రౌండర్లతో సమతూకంతో కనిపిస్తుంటాయి. అయితే, భారత జట్టులో హార్దిక్ పాండ్య ఎంట్రీ తర్వాత ఆల్ రౌండర్ కొరత తీరిందని అందరూ భావించారు. కానీ ఫిట్ నెస్ సరిపోవడంలేదంటూ హార్దిక్ పాండ్య కొన్నాళ్లుగా బౌలింగ్ చేయడం మానేశాడు. కేవలం బ్యాట్స్ మన్ గానే టీమిండియాలో కొనసాగుతున్నాడు.

దీనిపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ స్పందించాడు. బౌలింగ్ చేసేందుకు అవసరమైన ఫిట్ నెస్ హార్దిక్ లో లేనప్పుడు, అతడ్ని పక్కనబెట్టి మరో ఆల్ రౌండర్ ను తీసుకోవాలని సూచించాడు. ఈ దిశగా టీమిండియా మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చాడు.

హార్దిక్ పాండ్య చాలాకాలంగా బౌలింగ్ కు దూరంగా ఉంటున్నాడని, ఒకవేళ అతను ఇప్పుడు బౌలింగ్ చేసినా సఫలం అయ్యే అవకాశాలపై నిర్దిష్టంగా చెప్పలేమని హడిన్ తెలిపాడు. ఈ విషయంలో టీమిండియా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వివరించాడు.

  • Loading...

More Telugu News