Khel Ratna: ఖేల్ రత్న, అర్జున అవార్డులు ప్రకటించిన కేంద్రం

  • 11 మందికి ఖేల్ రత్న
  • 35 మందికి అర్జున అవార్డులు
  • నీరజ్ చోప్రాకు ఖేల్ రత్న
  • శిఖర్ ధావన్ కు అర్జున అవార్డు
Union govt announces prestigious sports awards

కేంద్రం 2021 సంవత్సరానికి గాను క్రీడారంగంలో అందించే ప్రతిష్ఠాత్మక ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 11 మందిని ఖేల్ రత్నకు ఎంపిక చేశారు.

ఖేల్ రత్నకు ఎంపికైన వారిలో ఒలింపిక్ పసిడి విజేత నీరజ్ చోప్రా (జావెలిన్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సిం), అవని లేఖర (పారా షూటింగ్), మిథాలీరాజ్ (క్రికెట్), సునీల్ ఛెత్రి (ఫుట్ బాల్), శ్రీజేష్ (హాకీ), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింట), సుమీత్ ఆంటిల్ (అథ్లెటిక్స్), కృష్ణా నాగర్ (బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్) ఉన్నారు.

అటు, 35 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు ప్రకటించారు. క్రికెటర్లలో శిఖర్ ధావన్ అర్జున అవార్డుకు ఎంపికయ్యాడు. అర్జున అవార్డుకు ఎంపికైన వారిలో శిఖర్ ధావన్ (క్రికెట్), యోగేశ్ కథునియా (డిస్కస్ త్రో), నిషాద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), ఎల్ వై సుహాస్ (బ్యాడ్మింటన్), సింగ్ రాజ్ అధానా (షూటింగ్), భవీనా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్వీందర్ సింగ్ (ఆర్చరీ) తదితరులు ఉన్నారు.

ఇక ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన వారిలో రాధాకృష్ణన్ నాయర్, టీపీ ఓసెఫ్, సందీప్ సంగ్వాన్ తదితరులు ఉన్నారు.

More Telugu News