కొరటాల సినిమా కోసం డిసెంబర్ లో సెట్స్ పైకి ఎన్టీఆర్!

27-10-2021 Wed 17:49
  • కొరటాలతో ఎన్టీఆర్ మూవీ
  • కథానాయికగా అలియా భట్
  • మేజర్ షెడ్యూల్ హైదరాబాద్ లో
  • ఈజిప్ట్ లో 40 రోజుల షూటింగు
Ntr in Koratala movie
కొరటాల శివ దర్శకత్వంలో ఇంతకుముందు 'జనతా గ్యారేజ్' సినిమా చేసిన ఎన్టీఆర్, ఆ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాల్లోనే కొరటాల ఉన్నాడు.

యాక్షన్ .. ఎమోషన్  తో కూడిన ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ ను అనుకుంటున్నారట. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ లోగా ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ సరదాగా ఫారిన్ ట్రిప్ వేసి వస్తాడని అంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో వేసిన భారీ సెట్లో జరుగుతుందట. ఆ తరువాత ఈజిప్ట్ లో 40 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. కల్యాణ్ రామ్ - మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.