Rajinikanth: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీలను కలిసిన రజనీకాంత్ దంపతులు

Rajinikanth meets Ram Nath Kovind and Narendra Modi
  • దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న రజనీ
  • 25న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కార ప్రదానం
  • మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి, ప్రధానిలను కలుసుకున్న రజనీ
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకునేందుకు ఆయన తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. 25వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని స్వీకరించారు. ఈరోజు ఆయన తన అర్ధాంగి లతతో కలిసి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలను కలిశారు. మర్యాదపూర్వకంగా వీరి సమావేశం జరిగింది.
Rajinikanth
Ram Nath Kovind
President Of India
Narendra Modi
BJP

More Telugu News