తర్వాతి మ్యాచ్ కు నిన్ను పక్కన పెట్టేస్తున్నా.. పంత్ తో కోహ్లీ చిట్ చాట్.. ఇదిగో వీడియో

27-10-2021 Wed 14:40
  • వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో మ్యాచ్
  • కొత్త ప్రోమో విడుదల చేసిన స్టార్ స్పోర్ట్స్
  • వికెట్ పడ్డప్పుడల్లా గ్లోవ్స్ మార్చుకుంటానంటూ కోహ్లీతో సంభాషణ
  • అసలు నిన్నే పక్కనపెట్టేస్తానని కెప్టెన్ కౌంటర్
  • సరదా వీడియోను ట్వీట్ చేసిన చానెల్
Kohli Pant Funny Conversation
పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఓడిపోయినా.. గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కెప్టెన్ కోహ్లీ, కీపర్ రిషభ్ పంత్ లు కీలక పాత్ర పోషించారు. వచ్చే ఆదివారం న్యూజిలాండ్ తో టీమిండియా తన రెండో పోరులో తలపడనుంది. ఆ మ్యాచ్ కు పంత్ ను తప్పిస్తానంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే, అవన్నీ సరదా వ్యాఖ్యలే అనుకోండి. ‘స్కిప్పర్ కాలింగ్ కీపర్’ అంటూ స్టార్ స్పోర్ట్స్ కొత్తగా ప్రమోషన్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఈ కొత్త ప్రోమోను తీసుకొచ్చింది. అందులో కోహ్లీకి పంత్ ఫోన్ చేసి.. మ్యాచ్ లో గెలవాలంటే తనకో మంచి ఆలోచన వచ్చిందని, వికెట్ పడిన ప్రతిసారీ తాను గ్లోవ్స్ మార్చుకుంటానని, అనుమతివ్వాలని అన్నాడు. దానికి బదులిచ్చిన కోహ్లీ.. సిక్సర్ కొట్టిన ప్రతిసారీ తాను బ్యాట్ మార్చాలా? అంటూ సెటైర్ వేశాడు. గెలవాలంటే ఏదో ఒకటి మార్చాలి కదా అని పంత్ రిప్లై ఇచ్చాడు. ‘సరే ఒక పనిచేద్దాం.. అసలు నిన్నే తీసేద్దామని నేను అకుంటున్నాను’ అంటూ పంత్ కు కోహ్లీ సెటైర్ వేశాడు. 'అవన్నీ వదిలేసి మ్యాచ్ మీద ఫోకస్ పెట్టూ..' అంటూ సూచించాడు.