బద్వేలు ప్రజలారా, ఓ సారి ఆలోచించుకోండి: సోము వీర్రాజు

27-10-2021 Wed 11:08
  • ఊరూరా తిరిగి మైకులు పట్టుకొని ఊదరగొట్టారు వైఎస్ జ‌గ‌న్ గారు
  • ప్రజలకు ఇస్తామని చెప్పిన తాగునీరు, సాగునీరు ఇచ్చారా?
  • ఒక్కసారి కమలం గుర్తుకు ఓటు వేయండి
  • మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి
somu veerraju slams ycp
బ‌ద్వేలు ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైసీపీ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. 'నేను ఉన్నాను అంటూ ఊరూరా తిరిగి మైకులు పట్టుకొని ఊదరగొట్టిన వైఎస్ జ‌గ‌న్ గారు, 2 సంవత్సరాల కాలంలో బద్వేలు ప్రజలకు ఇస్తామని చెప్పిన తాగునీరు, సాగునీరు ఇచ్చారా?' అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

'బద్వేలు ప్రజలారా ఆలోచించుకోండి. ఒక్కసారి కమలం గుర్తుకు ఓటు వేయండి. మీ సమస్యలకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోండి' అని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ కురిపించిన హామీలు, ఇప్పుడు ఆయ‌న మాట్లాడుతోన్న తీరు‌ను వివ‌రిస్తూ సోము వీర్రాజు ఓ వీడియో పోస్ట్ చేశారు.