Mallu Bhatti Vikramarka: టీఆర్ఎస్, బీజేపీపై వ్యతిరేకతతో హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కే ఓటు వేస్తారు: భట్టి

Bhatti Vikramarka opines on Huzurabad By Election
  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • నేటితో ముగియనున్న ప్రచారం
  • దోపిడీదారులకు ప్రజలే బుద్ధి చెబుతారన్న భట్టి
  • కాంగ్రెస్, బీజేపీ కలిసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో నేటితో ప్రచారం పరిసమాప్తి కానుంది. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో దోపిడీదారులకు ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీపై వ్యతిరేకతతో హుజూరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు భిన్న ధృవాలు అని, కలిసే ప్రసక్తేలేదని భట్టి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నేతల మధ్య గ్యాప్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే తప్ప భేదాభిప్రాయాలు కాదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News