టీ20 వరల్డ్ కప్: దక్షిణాఫ్రికా టార్గెట్ 144 రన్స్

26-10-2021 Tue 17:28
  • దుబాయ్ లో వెస్టిండీస్ వర్సెస్ దక్షిణాఫ్రికా 
  • మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్
  • ఓపెనర్ లూయిస్ అర్ధసెంచరీ
  • లూయిస్ అవుటైన తర్వాత తగ్గిన స్కోరు
South Afrina set chase against West Indies
దుబాయ్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించాడు. పవర్ ప్లేలో సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన లూయిస్ 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. ఈ ఎడమచేతివాటం ఆటగాడు 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాదడం విశేషం. లూయిస్ అవుటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ కుదుపులకు లోనైంది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ 26 పరుగులు నమోదు చేశాడు. సఫారీ బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 3, కేశవ్ మహరాజ్ 2, రబాడా 1, ఆన్రిచ్ నోర్జే 1 వికెట్ తీశారు.