Rahul Dravid: టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న రాహుల్ ద్రావిడ్

Rahul Dravid applies for Team India head coach post
  • టీ20 టోర్నీతో ముగియనున్న రవిశాస్త్రి పదవీకాలం
  • ఇటీవల ద్రావిడ్ తో గంగూలీ చర్చలు!
  • దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
  • రేసులో ముందున్న ద్రావిడ్
టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియనుంది. ఐసీసీ టోర్నీ తర్వాత రవిశాస్త్రి కొనసాగే అవకాశాలు లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో అందరికంటే ముందున్న రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రావిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ ఆ సమయంలోనే కథనాలు కూడా వచ్చాయి.
Rahul Dravid
Head Coach
Team India
BCCI

More Telugu News