నేనొచ్చేశా.. కాంగ్రెస్ , బీజేపీలకు లాలూ మెసేజ్ ఇదే

26-10-2021 Tue 14:30
  • అరెస్టులు, అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లూ దూరం
  • ప్రజల ప్రేమ, అభిమానంతోనే రాగలిగా
  • ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్
Lalu Returns Gives Message To Congress and BJP
ప్రజల ప్రేమ, ఆదరాభిమానాలతోనే తాను తిరిగి రాగలిగానని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అరెస్టులు, అనారోగ్య కారణాలతో గత రెండు ఎలక్షన్లకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉప ఎన్నికల తరుణంలో తాను రాగలిగానని, అందుకు ప్రజల ప్రేమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

నితీశ్ కుమార్ పై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారని, అది త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీకి తెలిసి వస్తుందని అన్నారు. ప్రధాని అంటే నితీశ్ కుమార్ లాగా ఉండాలన్న నినాదాలు వినిపిస్తున్నాయని, ప్రధాని అభ్యర్థిగా ఆయన్ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న కుశేశ్వర్, తారాపూర్ లో రేపు బహిరంగ సభ నిర్వహిస్తానని లాలూ తెలిపారు. కాంగ్రెస్ తో పొత్తుపై స్పందించిన ఆయన.. ఒకేరకమైన ఆలోచనలున్న లౌకికవాద పార్టీలతోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని గుర్తు చేశారు.