Gadikota Srikanth Reddy: బద్వేలులో ఆర్మీ మొత్తాన్ని దించినా మాకేమీ ఇబ్బందిలేదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

  • ఈ నెల 30న బద్వేలు ఉప ఎన్నిక
  • కేంద్ర పరిశీలకుడికి ఫిర్యాదు చేసిన బీజేపీ
  • స్థానిక పోలీసులను తొలగించాలని విజ్ఞప్తి
  • తమకు ప్రజాబలం ఉందన్న శ్రీకాంత్ రెడ్డి
Srikanth Reddy opines on Budvel by elections

బద్వేలు ఉప ఎన్నికలో స్థానిక పోలీసులను తొలగించాలంటూ ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు భీష్మకుమార్ కు విజ్ఞప్తి చేయడం పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. బద్వేలులో కేంద్ర బలగాలను దించి హడావుడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బద్వేలు అధికారులపై బీజేపీ లేనిపోని ఆరోపణలు చేస్తోందని అన్నారు. బద్వేలులో తమకు ప్రజాబలం ఉందని స్పష్టం చేశారు. మొత్తం ఆర్మీ బలగాలన్నింటినీ దించినా తమకేమీ ఇబ్బందిలేదని పేర్కొన్నారు. తాము కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలనే కోరుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఆ సందర్భంగా ఆయన బీజేపీకి ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు. విభజన చట్టం హామీలు నెరవేర్చితే తాము పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, ఉక్కు పరిశ్రమ ఇవ్వాలని వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రే స్వయంగా చెప్పారని వెల్లడించారు.

More Telugu News