Margani Bharat: రాష్ట్ర పరువు తీయడానికే బాబు ఢిల్లీ వెళ్లాడు: వైసీపీ ఎంపీ మార్గాని భరత్

YCP MP Margani Bharat comments on Chandrababu Delhi visit
  • ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు
  • రాష్ట్రపతితో సమావేశం
  • బాబు డ్రగ్స్ రాజకీయాలు తీసుకువచ్చాడన్న భరత్
  • బూతులు కూడా జోడిస్తున్నాడని వ్యంగ్యం
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర యువతపై డ్రగ్స్ నెపం మోపుతూ రాష్ట్ర పరువు తీయడానికే బాబు ఢిల్లీ వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి పెద్దలను కూడా క్యారే బోసడీకే అనే పిలుస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఆ పదం ఢిల్లీలో వాడితే చెప్పుతో కొడతారని ఘాటుగా స్పందించారు.

"గతంలో ప్రధాని మోదీని తిట్టిన సీడీలు చూపించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడా? లేక తిరుపతిలో అమిత్ షాపై రాళ్ల దాడి చేసిన వీడియోలు చూపించడానికి ఢిల్లీ వెళ్లాడా? మత, కుల రాజకీయాలు అయిపోయి, కొత్తగా డ్రగ్స్ రాజకీయాలు తెస్తున్నాడు. వాటికి బూతులు కూడా జోడిస్తున్నాడు" అంటూ ధ్వజమెత్తారు.

75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏపీలో బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తుంటే బాబు కడుపుమండుతోందని అన్నారు. ఎన్నికల్లో గెలవలేక 356 ఆర్టికల్ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటూ కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు.
Margani Bharat
Chandrababu
New Delhi
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News