రూ. 3 కోట్లు చెల్లించాలంటూ రిక్షా పుల్లర్ కు ఐటీ నోటీసులు
- ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటన
- నోటీసులపై పోలీసులను ఆశ్రయించిన రిక్షా పుల్లర్
- కేసు నమోదు చేయలేమన్న పోలీసులు
మథురలోని బకల్ పూర్ ప్రాంతంలోని అమర్ కాలనీకి చెందిన ప్రతాప్ సింగ్ కు ఈ నోటీసులు వచ్చాయి. దీంతో, ఆయన పోలీసులను ఆశ్రయించాడు. అయితే రిక్షాపుల్లర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేమని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థంకాక తనకు అందిన నోటీసులను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.