రీతూ వర్మతో మళ్లీ నటించాలని ఉంది: నాగశౌర్య

24-10-2021 Sun 11:43
  • ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం 
  • నిర్మాతలను అభినందించాలి 
  • ఓటీటీలో ఇప్పట్లో రాదు 
  • థియేటర్లలోనే చూడండి 
  • ఈ నెల 29వ తేదీన విడుదల       
Varudu Kaavalenu movie update
నాగశౌర్య - రీతూ వర్మ జంటగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ కి తగినట్టుగా 'సంగీత్' పేరుతో నిన్న రాత్రి ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కి పూజ హెగ్డే ముఖ్య అతిథిగా హాజరైంది.

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ .. " కరోనా ఫస్టు వేవ్ .. సెకండ్ వేవ్ దాటుకుంటూ ఎన్నో కష్టాలు పడుతూ ఈ సినిమాను పూర్తి చేశాము. ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వచ్చినా, థియేటర్లలో రిలీజ్ చేయాలనే పట్టుదలతో నిర్మాతలు హోల్డ్ లో పెడుతూ వచ్చారు. అందుకు వాళ్లకి థ్యాంక్స్ చెప్పుకోవాలి.

ఇక రీతూ వర్మ చాలా బాగా నటించింది. ఆమె అంకితభావం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమెతో కలిసి మళ్లీ మళ్లీ నటించాలని ఉంది. ఇక పూజ హెగ్డే ఈ ఫంక్షన్ కి గెస్టు కాదు .. ఫ్యామిలీ మెంబర్. ఈ సినిమా ఓటీటీలో రావడానికి చాలా సమయం పడుతుంది. అందువలన అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.