టీ20 వరల్డ్ కప్: సూపర్-12 పోరులో ఇంగ్లండ్ ఘనవిజయం

23-10-2021 Sat 22:10
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ బోణీ
  • వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో విజయం
  • 56 పరుగుల లక్ష్యాన్ని 8.2 ఓవర్లలో ఛేదన
England won the super twelve opener against West Indies
టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. వెస్టిండీస్ తో జరిగిన సూపర్-12 లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత వెస్టిండీస్ ను 55 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్... 8.2 ఓవర్లలోనే లక్ష్యఛేదన పూర్తిచేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా దిగిన జోస్ బట్లర్ 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అకీల్ 2, రవి రాంపాల్ 1 వికెట్ తీశారు.