Nara Lokesh: కాట్రగడ్డ హఠాన్మరణం అత్యంత బాధాకరం: నారా లోకేశ్

Lokesh condolences Katragadda Babu sudden demise
  • టీడీపీ నేత కాట్రగడ్డ బాబు గుండెపోటుతో మృతి
  • ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
  • బలమైన నేతను కోల్పోయామని వెల్లడి
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు (బాబు) హఠాన్మరణం పట్ల టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. విజయవాడ లబ్బీపేటలోని తన నివాసంలో ఆయన గుండెపోటుకు గురికాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాట్రగడ్డ బాబు మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక బలమైన నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.
Nara Lokesh
Katragadda Babu
Demise
TDP
Andhra Pradesh

More Telugu News