Chiranjeevi: 'భోళాశంకర్' వెనక్కి .. 'వాల్తేర్ వీరయ్య' ముందుకు?

  • 'గాడ్ ఫాదర్' షూటింగులో చిరు
  • మెహర్ రమేశ్ తో 'భోళా శంకర్'
  • బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వీరయ్య'
  • మనసు మార్చుకున్న చిరంజీవి    
Bhola Shankar movie update

ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నారు. ఇది మలయాళ మూవీ 'లూసిఫర్'కి రీమేక్. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' సినిమా చేయవలసి ఉంది.

ఆ మధ్య తమిళంలో అజిత్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .. కథ ఇక్కడ పుట్టి పెరిగిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాల వరుస విషయంలో మెగాస్టార్ మనసు మారిందనే టాక్ వినిపిస్తోంది.

ముందుగా 'వాల్తేర్ వీరయ్య' సినిమాను పూర్తి చేసి, ఆ తరువాతనే 'భోళాశంకర్' తో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. వెంటవెంటనే రెండు రీమేకులు చేయకుండా, మధ్యలో ఒక స్ట్రయిట్ సినిమా చేయడమే మంచిదనే అభిప్రాయంలో చిరంజీవి ఉన్నారని అంటున్నారు. 

More Telugu News