ఒకే విమానంలో ప్రయాణించిన ప్రియాంకాగాంధీ, అఖిలేశ్ యాదవ్

23-10-2021 Sat 10:49
  • ఢిల్లీ నుంచి లక్నోకు ప్రయాణం
  • చిరునవ్వులతో పలకరించుకున్న నేతలు
  • ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్న సమాజ్ వాది పార్టీ
Priyanka and Akhilesh Yadav travelled in same flight
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకురాలు ప్రియాంకాగాంధీలు ఒకే విమానంలో ప్రయాణించారు. ఢిల్లీ నుంచి లక్నోకు నిన్న రాత్రి వీరు కలిసి ప్రయాణించారు. విమానంలో వీరిద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ప్రియాంకాగాంధీ, అఖిలేశ్ యాదవ్ ల మధ్య ఢిల్లీ నుంచి లక్నో విమానంలో ప్రణాళిక లేని మర్యాదపూర్వక సమావేశం జరిగిందని పేర్కొంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సమావేశమని, వీరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని చెప్పింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్, ప్రియాంక ఇద్దరూ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు.