36 గంటల దీక్ష ముగించిన చంద్రబాబు... సోమవారం ఢిల్లీకి పయనం

22-10-2021 Fri 21:07
  • నిన్నటి నుంచి చంద్రబాబు దీక్ష
  • నేటి రాత్రితో ముగింపు
  • చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన టీడీపీ మహిళా నేతలు
  • చంద్రబాబుకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఖరారు
Chandrababu ends protest in TDP office
వైసీపీ శ్రేణులు తమ పార్టీ ప్రధాన కార్యాలయంపై చేసిన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష ముగిసింది. మంగళగిరి టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళలు నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు.

కాగా, చంద్రబాబు సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్ మెంట్ ఖరారైంది. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని చంద్రబాబు, టీడీపీ నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు బృందం పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవనుంది.