పనిమనిషిని సన్మానించిన కృష్ణంరాజు.. శభాష్ అంటున్న నెటిజన్లు!

22-10-2021 Fri 17:54
  • కృష్ణంరాజు ఇంట్లో 25 ఏళ్లుగా పని చేస్తున్న పద్మ
  • ఆమెతో కేక్ కట్ చేయించిన రెబల్ స్టార్ కుటుంబం
  • పద్మకు గోల్డ్ చైన్ బహూకరించిన కృష్ణంరాజు సతీమణి
Krishnam Raju falicitates maid
తమ ఇంట్లో పని చేస్తున్న పద్మ అనే పనిమనిషిని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఘనంగా సన్మానించారు. 25 ఏళ్లుగా ఆమె కృష్ణంరాజు ఇంట్లో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో '25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్' అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. పద్మకు కృష్ణంరాజు భార్య బంగారు చైన్ ని కానుకగా ఇచ్చినట్టు సమాచారం.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. '25 ఏళ్లుగా మాకోసం ఎంతో చేశారు. థాంక్యూ పద్మ ఆంటీ' అని ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పనిమనిషిని కూడా ఇంట్లో మనిషిగా చేసుకున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.