Kakani Govardhan: ఓటమి ఖాయమనే విషయం సోము వీర్రాజుకు తెలుసు: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Somu Veerraju knows their defeat in Badvel election says Kakani Govardhan
  • టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారు
  • బద్వేలులో నీటి సమస్యపై వీర్రాజు విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నాం
  • రోడ్లు, డ్రైనేజీల సమస్యకు వైసీపీ ప్రభుత్వంలోనే పరిష్కారం దొరుకుతుంది
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీతో బీజేపీ నేతలు మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీకి భారీ ఓటమి ఖాయమనే విషయం సోము వీర్రాజుకు తెలుసని... అందుకే ఓటమికి గల కారణాలను వీర్రాజు టీమ్ అప్పుడే రెడీ చేస్తోందని ఎద్దేవా చేశారు.

బద్వేలులో నీటి సమస్యపై సోము వీర్రాజు విసిరిన సవాల్ ను వైసీపీ స్వీకరిస్తోందని చెప్పారు. బద్వేలు ప్రజలకు తాగునీరు ఇచ్చింది వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు మాత్రమే అని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్యకు వైసీపీ ప్రభుత్వంలోనే పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. బద్వేల్ లో ఓటు వేయమని అడిగే నైతిక హక్కు కూడా బీజేపీకి లేదని అన్నారు.
Kakani Govardhan
YSRCP
Somu Veerraju
BJP

More Telugu News