'నాట్యం' చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు

22-10-2021 Fri 17:19
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాట్యం'
  • సంధ్యారాజు ప్రధాన పాత్రలో విలక్షణ చిత్రం
  • నాట్యకళ గొప్పదనాన్ని ఆవిష్కరించారన్న వెంకయ్య
  • కళల ప్రాధాన్యతను కళ్లకు కట్టారని ప్రశంసలు
Venkaiah Naidu appreciates Natyam movie crew
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నాట్యం'. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ఓ విలక్షణ కథాంశంతో తెరకెక్కిన చిత్రానికి ఆమే నిర్మాత. కాగా, ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'నాట్యం' బృందానికి అభినందనలు తెలిపారు. కూచిపూడి నృత్యకళాకారిణి సంధ్యారాజు ప్రధానపాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాట్యకళ గొప్పదనాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టారని ప్రశంసించారు. ఈ చిత్ర దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు అంటూ వెంకయ్య తన స్పందన తెలియజేశారు.