Tesla: ముందు రండి.. భారత్ లో కార్లు తయారు చేయండి: టెస్లాకు కేంద్రం వెల్ కమ్

  • పన్ను ప్రయోజనాలు కల్పిస్తామన్న నీతిఆయోగ్
  • మస్క్ ప్రతిపాదనకు కాలం చెల్లిందని వ్యాఖ్య
  • కొత్త ఆలోచనతో రావాలని సూచన
Niti Ayog Says Tesla to start production first in india

దేశంలో విద్యుత్ కార్లను తయారు చేయాల్సిందిగా టెస్లాను కేంద్రం కోరింది. దేశంలో తయారు చేస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనాలను కల్పిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. పబ్లిక్ ఫోరం ఆఫ్ ఇండియా నిర్వహించిన వర్చువల్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. అయితే, వేరే దేశాల్లో తయారైన కార్లను భారత్ కు తీసుకురావడం మాత్రం కుదరదని ఆయన తేల్చి చెప్పారు.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ఆ ప్రతిపాదనకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. భారత్ లోనే కార్లను తయారు చేసేందుకు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని చెప్పారు. దేశంలో తయారీని ప్రారంభించాకే పన్నుల తగ్గింపుపై ఆలోచిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంటరయ్యేందుకు టెస్లా ప్రయత్నాలను చేస్తూనే ఉంది. కార్ల దిగుమతిపై సుంకాలను తగ్గించాల్సిందిగా మస్క్ విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

More Telugu News