సమంత కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోర్టు!

22-10-2021 Fri 11:53
  • యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేసిన సమంత
  • ఆ ఛానళ్ల నుంచి క్షమాపణ కోరవచ్చు కదా అని వ్యాఖ్యానించిన కోర్టు
  • ఈరోజు వెలువడనున్న తుదితీర్పు
Court response in Samanthas defamation suit
గత నెలలో అక్కినేని నాగ చైతన్య, సమంతలు వైవాహిక జీవితం నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంత క్యారక్టర్ ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి.

ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించాయంటూ రెండు యూట్యూబ్ ఛానళ్లపై సమంత హైదరాబాదులోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసింది. పిటిషన్ పై వాదనల సందర్భంగా కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది. సదరు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేయడం కంటే... వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మరోవైపు ఈరోజు ఈ కేసుపై తుదితీర్పు వెలువడనుంది.