టీ20 వరల్డ్ కప్: గ్రూప్-బిలో ఆసక్తికర పోరు... స్కాట్లాండ్ వర్సెస్ ఒమన్

21-10-2021 Thu 20:23
  • ముగింపు దశకు చేరిన గ్రూప్ పోటీలు
  • గ్రూప్-2 నుంచి ఇప్పటికే సూపర్-12 చేరిన బంగ్లాదేశ్
  • స్కాట్లాండ్, ఒమన్ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు మరో బెర్తు
  • టేబుల్ టాపర్ ను నిర్ణయించే మ్యాచ్
Scotland faces Oman in a decider match
టీ20 వరల్డ్ కప్ తొలి రౌండ్ గ్రూప్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇవాళ స్కాట్లాండ్, ఒమన్ మధ్య ఆసక్తికర సమరం జరుగుతోంది. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్ ఇప్పటికే సూపర్ -12 దశకు చేరుకోగా, ఇదే గ్రూప్ నుంచి తదుపరి దశకు చేరుకునే జట్టు ఏదో స్కాట్లాండ్-ఒమన్ మ్యాచ్ తో తేలనుంది.

 ఈ పోరులో స్కాట్లాండ్ గెలిస్తే గ్రూప్ టాపర్ హోదాలో ఏ1గా సూపర్-12కు చేరుకుంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ ఏ2 అవుతుంది. ఒమన్ గెలిస్తే మాత్రం స్కాట్లాండ్ ఆశలు గల్లంతవుతాయి. మెరుగైన రన్ రేట్ ఉన్న ఒమన్ ఏ2గా సూపర్-12లో అడుగుపెడుతుంది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఒమన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 3 వికెట్లకు 51 పరుగులు. ఓపెనర్ అకిల్ ఇలియాస్ 37 పరుగులు చేసి అవుటయ్యాడు.