వైజయంతీ మూవీస్ లో చైతూ!

21-10-2021 Thu 19:03
  • 'లవ్ స్టోరీ'తో హిట్ కొట్టిన చైతూ 
  • వచ్చే ఏడాది రానున్న 'థ్యాంక్యూ'
  • సెట్స్ పైకి వెళ్లిన 'బంగార్రాజు'
  • నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా    
Nagachaitanya in Nandini Reddy movie
నాగచైతన్య కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'లవ్ స్టోరీ' భారీ విజయాన్ని అందుకుంది. ఆయన కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'థ్యాంక్యూ' చేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్ దర్శకత్వంలో నందినీ రెడ్డి ఒక సినిమా చేస్తోంది.

 ఆ సినిమా పూర్తవ్వగానే నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టుపైకి వస్తుందని చెబుతున్నారు. ఈ లోగా చైతూ కూడా 'బంగార్రాజు'లో తన పోర్షన్ పూర్తి చేస్తాడట. చైతూతో నందినీ రెడ్డి చేయనున్న కథ, గతంలో విజయ్ దేవరకొండ కోసం అనుకున్నదేననే టాక్ వినిపిస్తోంది.