విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా 'రొమాంటిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

21-10-2021 Thu 18:38
  • ఆకాశ్ పూరి నుంచి 'రొమాంటిక్'
  • కథానాయికగా కేతిక పరిచయం 
  • రేపు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 29వ తేదీన సినిమా రిలీజ్  
Romantic Pre Release Event
ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా 'రొమాంటిక్' సినిమా రూపొందింది. పూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అందించాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబై చాలా కాలమే అయినా, సరైన విడుదల సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చింది.

రీసెంట్ గా ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. ఇక ఈ నెల 22వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. వరంగల్ - రంగీలా మైదానంలో ఈ ఫంక్షన్ ను జరుపుతున్నట్టుగా పోస్టర్  వదిలారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి దర్శకత్వంలో 'లైగర్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఈ వేడుక సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకానుంది. రీసెంట్ గా ప్రభాస్ రిలీజ్ చేసిన  ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.