మధ్యప్రదేశ్ లో నేలకూలిన మిరాజ్ యుద్ధ విమానం

21-10-2021 Thu 14:48
  • శిక్షణ కోసం గాల్లోకి లేచిన మిరాజ్ ఫైటర్ 
  • కొద్దిసేపట్లోనే కూలిన వైనం
  • బింద్ జిల్లాలో విమాన శకలాలు
  • పైలెట్ సురక్షితం
  • సాంకేతిక లోపాలే కారణమంటున్న వాయుసేన!
IAF figher jet Miraj crashed in Madhya Pradesh
గతంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు తరచుగా కుప్పకూలేవి. తాజాగా మిరాజ్-2000 శ్రేణికి చెందిన ఓ యుద్ధ విమానం మధ్యప్రదేశ్ లో నేలకూలింది. బింద్ జిల్లాలోని మనకాబాద్ వద్ద ఓ నిర్జన ప్రదేశంలో ఈ ఫైటర్ విమానం కూలిపోయింది.

రోజువారీ శిక్షణలో భాగంగా ఎయిర్ బేస్ నుంచి నింగికి ఎగిరిన మిరాజ్ యుద్ధ విమానం కొద్దిసేపట్లోనే గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ తో సంబంధాలు కోల్పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ పారాచూట్ ద్వారా తప్పించుకున్నాడు. పైలెట్ సురక్షితంగా ఉన్నాడని భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. సాంకేతిక లోపం వల్లే విమాన ప్రమాదం జరిగి ఉంటుందని వాయుసేన వర్గాలు భావిస్తున్నాయి.