Imran Khan: గిఫ్ట్‌‌గా వచ్చిన గడియారాన్ని కూడా అమ్ముకున్నారు: ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాల మండిపాటు

Pakistan opponent parties criticising Imran Khan for selling watch
  • విదేశీ అప్పులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్
  • దేశాన్ని ఇమ్రాన్ అప్పులపాలు చేశాడంటూ విపక్షాల ఫైర్
  • వాచ్ ను అమ్మేసి రూ. 7.4 కోట్లను జేబులో వేసుకున్నాడని విమర్శలు
పాకిస్థాన్ పరువు తీసేశావంటూ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశంలోని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అత్యధిక విదేశీ అప్పులు కలిగిన టాప్ టెన్ దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరిందని ప్రపంచ బ్యాంకు ఇటీవలే తెలిపింది. దీంతో, దేశాన్ని రెండేళ్ల పాలనలో ఇమ్రాన్ ఖాన్ అప్పులపాలు చేశాడంటూ విపక్షాలు ఆయనపై మండిపడుతున్నాయి.

మరోవైపు, ఇతర దేశాధినేతల నుంచి బహుమతులుగా వచ్చిన ఖరీదైన వస్తువులను ఇమ్రాన్ అమ్ముకుంటున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. గల్ఫ్ దేశానికి చెందిన ఓ యువరాజు ఇచ్చిన ఖరీదైన వాచ్ ను తన సన్నిహితుడి ద్వారా దుబాయ్ లో విక్రయించారని... తద్వారా ఇమ్రాన్ తన జేబులో రూ. 7.4 కోట్లు వేసుకున్నారని ఆరోపించాయి. ఇమ్రాన్ పాకిస్థాన్ పరువు తీస్తున్నారని మండిపడ్డాయి.
Imran Khan
Pakistan
Watch

More Telugu News