షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో ఎన్సీబీ అధికారుల తనిఖీలు

21-10-2021 Thu 13:55
  • బాలీవుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
  • ఆర్యన్ వాట్సాప్ చాట్ లో యువ నటి పేరు
  • విచారణకు హాజరుకావాలంటూ అనన్య పాండేకు ఎన్సీబీ నోటీసులు
NCB searches Shahrukh and Ananya Pandey houses
డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్ ని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కొడుకును ఓదార్చేందుకు షారుఖ్ ఈరోజు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు.

మరోవైపు ఎన్సీబీ అధికారులు ఈరోజు షారుఖ్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. ఆర్యన్ ఖాన్ ఒక యువ నటితో డ్రగ్స్ గురించి వాట్సాప్ లో సంభాషించినట్టు కోర్టుకు ఎన్సీబీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఆ యువనటి అనన్య పాండే అని తెలుస్తోంది. మరోవైపు అనన్య ఫోన్ ను కూడా ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణకు హాజరు కావాలంటూ ఆమెను ఆదేశించారు.