Shiva Karthikeyan: తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన శివకార్తికేయన్!

Varun Doctor Movie update
  • యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన 'వరుణ్ డాక్టర్'
  • కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్
  • ఆసక్తిని రేపిన కథాకథనాలు 
  • టైటిల్ మైనస్ అయిందనే టాక్  
తెలుగు మార్కెట్ పై పట్టు సాధించడానికి తమిళ హీరోలు ఎపుడూ పోటీపడుతూనే ఉంటారు. ఈ నేపథ్యంలో నేరుగా తెలుగు సినిమాలు చేయడానికి కూడా వాళ్లు సిద్ధమవుతున్నారు. ఆ జాబితాలో సూర్య .. కార్తి .. విశాల్ .. ధనుశ్ కనిపిస్తున్నారు. ఇక తాను కూడా తగ్గేది లేదన్నట్టుగా శివకార్తికేయన్ కూడా గట్టిపట్టుదలపైనే ఉన్నాడు.

శివకార్తికేయన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆయన తన సొంత నిర్మాణంలో తమిళంలో చేసిన 'డాక్టర్' సినిమాను, 'వరుణ్ డాక్టర్' టైటిల్ తో ఈ నెల 9వ తేదీన తెలుగులోను విడుదల చేశాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకి ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది.

కథాకథనాల పరంగా మంచి ప్రయత్నంగా చెబుతున్నారు. అయితే టైటిల్ మైనస్ అయిందని అనుకున్నవారు లేకపోలేదు. ఏదేమైనా తన సినిమాను ఆదరించినందుకుగాను, సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు శివకార్తికేయన్ థ్యాంక్స్ చెప్పాడు.
Shiva Karthikeyan
Priyanka Arul Mohan

More Telugu News