రామ్ గోపాల్ వ‌ర్మ 'మా'పై చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన మంచు మ‌నోజ్!

19-10-2021 Tue 13:02
  • మొత్తం జోక‌ర్ల‌తో సినిమా స‌ర్క‌స్ నిండిపోయింద‌న్న ఆర్జీవీ
  • మీరు అందులో రింగ్ మాస్ట‌ర్ స‌ర్ అంటూ మ‌నోజ్ ఎద్దేవా
  • సరైన పంచ్ ఇచ్చావ్ అంటోన్న అభిమానులు
Manchu Manoj counters RGV
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌లెత్తిన వివాదాలు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన విష‌యం తెలిసిందే. న‌టీన‌టులు మాట‌ల తూటాలు పేల్చిన తీరు, వారి ప్ర‌వ‌ర్త‌న వారికే త‌ల‌వొంపులు తెచ్చిపెట్టింది. సినీ న‌టుల మాట‌ల‌పై సామాజిక మాధ్య‌మాల్లో ఎన్నో మీమ్స్ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో సినీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా 'మా'పై సెటైర్లు వేశారు.

మొత్తం జోక‌ర్ల‌తో సిని'మా' స‌ర్క‌స్ నిండిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. దీనిపై 'మా' కొత్త అధ్య‌క్షుడు మంచు విష్ణు సోద‌రుడు, హీరో మంచు మ‌నోజ్‌ స్పందించాడు. 'మీరు అందులో రింగ్ మాస్ట‌ర్ స‌ర్' అంటూ ఎద్దేవా చేశాడు. దీంతో 'సరైన పంచ్ ఇచ్చావ్.. అన్నా..' అంటూ మంచు మ‌నోజ్‌ పై అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.