మలయాళ రీమేక్ పై ఆసక్తి చూపుతున్న నాగ్!

19-10-2021 Tue 10:46
  • టాలీవుడ్లో రీమేకుల జోరు
  • పెరుగుతున్న మలయాళ సినిమాల ప్రభావం
  • నాగ్ దృష్టిలో 'ది గ్రేట్ ఇండియన్ కిచన్'
  • త్వరలో రానున్న స్పష్టత  
The Great Indian Kitchen remake
ఇప్పుడు టాలీవుడ్లో రీమేక్ ల జోరు కొనసాగుతోంది. తమిళ .. మలయాళ భాషల్లోని కథలు టాలీవుడ్ కి భారీ స్థాయిలో దిగుమతి అవుతున్నాయి. ఈ మధ్య ఇక్కడ మలయాళ సినిమాల జోరు మరింత పెరిగింది. చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' .. 'వెంకటేశ్ 'దృశ్యం 2' మలయాళ రీమేక్ లే.

ఇక తాజాగా నాగార్జున కూడా ఒక మలయాళ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఆ మలయాళ సినిమా పేరే 'ది గ్రేట్ ఇండియన్ కిచన్'. జియో బేబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నిమిషా - సూరజ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

పెళ్లి తరువాత ఒక యువతి ఎన్నో ఆశలతో .. కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. అక్కడ పద్ధతులు నచ్చకపోయినా .. తన అభిరుచులను .. అభిప్రాయాలను పట్టించుకునేవారు లేకపోయినా ఎలా సర్దుకుపోతూ వచ్చిందనేదే కథ. చెప్పుకోవడానికి ఏమీ ఉండదు .. కానీ చూడటానికి బాగుంటుంది. మరి నాయిక ప్రధానమైన ఈ సినిమాలో నాగ్ నాయకుడిగా మారతారో .. నిర్మాతగా మాత్రమే ఉంటారో చూడాలి.