TDP: ఎంపీ కేశినేని బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్పందించిన సన్నిహితుడు ఫతావుల్లా

Roomers about kesineni Nani joining BJP is lie said tdp
  • బీజేపీ మునిగిపోయే నావ
  • కేశినేని కార్యాలయం బయట ఉన్న 40 అడుగుల చంద్రబాబు ఫొటోను చూడాలని హితవు
  • కార్యాలయంలో రతన్ టాటా ఫొటోను పెట్టడంపై వివరణ 
  • 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతారని ధీమా

విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు కేశినేని నాని బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితుడు, టీడీపీ నేత ఫతావుల్లా స్పందించారు. కేశినేని భవన్‌లో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. నాని టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపడేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్న వారు కార్యాలయం బయట ఉన్న 40 అడుగుల ఎత్తైన చంద్రబాబు ఫొటోను చూడాలని హితవు పలికారు.

ఇక కేశినేని భవన్‌లో ఒక చోట మాత్రమే రతన్‌టాటాతో కలిసి ఉన్న నాని ఫొటోను పెట్టారని అన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రతన్‌టాటా విస్తృతంగా సేవలు అందించారని, అందుకు కృతజ్ఞతగానే ఆయన ఫొటోను పెట్టారని వివరించారు. అంతే తప్ప పార్టీ మార్పు ఉద్దేశం నానికి లేదని అన్నారు.

విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని శాసనసభ స్థానాలకు పార్టీ ఇన్‌చార్జులుగా ఉన్న నాయకుల ఫొటోలను కూడా తొలగించారన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని, ఆ ఉద్దేశంతోనే నాని పనిచేస్తున్నారని వివరించారు. బీజేపీని మునిగిపోయే నావలా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేసి నాని హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News