టీ20 వరల్డ్ కప్: నమీబియా 96 ఆలౌట్

18-10-2021 Mon 21:42
  • అబుదాబిలో శ్రీలంక వర్సెస్ నమీబియా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 3 వికెట్లు పడగొట్టిన తీక్షణ
  • 29 పరుగులు చేసిన క్రెగ్ విలియమ్స్
Sri Lanka bowlers bundled out Namibia
శ్రీలంకతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 19.3 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ కు దిగిన నమీబియాకు శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడం శక్తికి మించిన పనైంది. ఆ జట్టులో క్రెగ్ విలియమ్స్ 29, ఎరాస్మస్ 20 పరుగులు చేశారు. లంక బౌలర్లలో తీక్షణ 3, లహిరు కుమార 2, హసరంగ 2 వికెట్లు తీశారు. కరుణరత్నే, చమీర చెరో వికెట్ పడగొట్టారు.

టీమిండియా-ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్

టీ20 వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ ఆడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. జానీ బెయిర్ స్టో 36 బంతుల్లో 49, మొయిన్ అలీ 20 బంతుల్లో 43 పరుగులు, లివింగ్ స్టన్ 20 బంతుల్లో 30 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, బుమ్రా 1, రాహుల్ చహర్ 1 వికెట్ తీశారు.