కారుణ్య నియామకాలపై కీలక నిర్ణయం తీసుకున్న జగన్

18-10-2021 Mon 18:27
  • కరోనాతో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు గుడ్ న్యూస్
  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జగన్ ఆదేశం
  • తక్షణమే నియామకాల ప్రక్రియను ప్రారంభించాలన్న సీఎం
Jagan key decision on compassionate appointments
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాన్ని కల్పించాలని ఆయన ఆదేశించారు. కారుణ్య నియామకాల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 30వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. కారుణ్య నియామకాలపై ఈరోజు జగన్ అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు.