జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ప్రకాశ్ రాజ్

18-10-2021 Mon 16:03
  • ఇంకా ముగియని మా ఎన్నికల రగడ
  • పోలింగ్ రోజున తనీశ్ పై దాడి జరిగిందంటున్న ప్రకాశ్ రాజ్
  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
  • సీసీటీవీ ఫుటేజి కోసం పట్టు
Prakash Raj complains to Jubilee Hills police
మా ఎన్నికల పోలింగ్ రోజున తన ప్యానెల్ కు చెందిన తనీశ్ పై దాడి జరిగిందని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనీశ్ పై దాడి జరిగిన విషయం సీసీటీవీ ఫుటేజి ద్వారా బయటికి వస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

అయితే, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ నుంచి ఎలాంటి స్పందన రావడంలేదని, సీసీటీవీ ఫుటేజి కోసం కోర్టుకు వెళ్లమంటున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. మా ఎన్నికల పోలింగ్ జరిగిన తీరుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.